: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీమ్యాప్ ఎండీగా ఆర్.వి. చంద్రవదన్, వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ కమిషనర్ గా క్రిస్టినా బదిలీ అయ్యారు. ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆప్ ఫెడరేషన్ ఎండీగా శ్రీనివాస్, రాజీవ్ స్వగృహ ఎండీగా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ గా సర్ఫరాజ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా అరుణ్ కుమార్ బదిలీ అయ్యారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్ కమిషనర్ గా కేవీ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు స్పెషల్ కమిషనర్ గా భారతీ హోలిమేరీ బదిలీ అయిన వారిలో ఉన్నారు.