: కేంద్ర ప్రభుత్వ శక్తి ముందు సీఎం నిలవలేరు: జానారెడ్డి


విభజన విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై జానారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేపథ్యంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కేంద్ర ప్రభుత్వ శక్తి ముందు నిలవలేరన్నారు. ఈ క్రమంలో సీఎం కూడా అంతేనన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. కానీ, గడువులోగా టీ బిల్లుపై చర్చ జరగకుండా మరింత సమయం కోరే కుట్ర జరుగుతోందని జానా అనుమానం వ్యక్తం చేశారు.

బిల్లుపై జాప్యం వల్ల ఇరు ప్రాంతాల ప్రజలు ఘర్షణకు దిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. శాసనసభలో అహంకార పూరిత పద్ధతుల్లో కొందరు ఆందోళనకు దిగుతున్నారని, స్పీకర్ తన అధికారాలన్నీ ఉపయోగించి సభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకమో లేక సభ్యులకు అవగాహన కోసమో స్పీకర్ సభను జనవరి 3 వరకు వాయిదా వేశారన్నారు.

  • Loading...

More Telugu News