: పథకాల ఫలాలు సామాన్యులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం: గవర్నర్
ప్రభుత్వ పథకాల ఫలాలు సామాన్యులకు అందజేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం రూపకల్పన చారిత్రక నిర్ణయమని కొనియాడారు. ప్రభుత్వం ద్రవ్య విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తీసుకురావడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆధార్ కార్డు పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. ఉగ్రవాద నేరాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం అలసత్వం వహించదని తెలిపారు. సురక్షిత నగర భావన కోసం హైదరాబాదులో సమగ్ర నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను, శాశ్వత వైకల్యం పొందిన వారిని ఆదుకుంటామని తెలిపారు.
రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల రాష్ట్రంలో చాలామంది లబ్ది పొందుతున్నారన్నారు. సరైన అజమాయిషీతోనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. నీలం తుపాను వల్ల రాష్టంలో భారీ పంట నష్టం జరిగిందన్న గవర్నర్, పంట నష్టం రూ.3,560 కోట్లని పేర్కొన్నారు.
రాజీవ్ యువకిరణాల ద్వారా 15 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభి వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.
రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తీసుకురావడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆధార్ కార్డు పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. ఉగ్రవాద నేరాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం అలసత్వం వహించదని తెలిపారు. సురక్షిత నగర భావన కోసం హైదరాబాదులో సమగ్ర నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను, శాశ్వత వైకల్యం పొందిన వారిని ఆదుకుంటామని తెలిపారు.
రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల రాష్ట్రంలో చాలామంది లబ్ది పొందుతున్నారన్నారు. సరైన అజమాయిషీతోనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. నీలం తుపాను వల్ల రాష్టంలో భారీ పంట నష్టం జరిగిందన్న గవర్నర్, పంట నష్టం రూ.3,560 కోట్లని పేర్కొన్నారు.
రాజీవ్ యువకిరణాల ద్వారా 15 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబా
- Loading...
More Telugu News
- Loading...