: ఢిల్లీలో ఈ నెల 27న కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల సమావేశం


దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. వచ్చే 2014 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, పొత్తులపై ప్రధానంగా చర్చించనున్నారని తెలిసింది. అలాగే పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News