: నేను 24 ఏళ్ల కుర్రాడిని!: అనిల్ కపూర్
24 తనకు అచ్చొచ్చిన సంఖ్య అని నటుడు అనిల్ కపూర్ చెప్పారు. డిసెంబర్ 24 (నేటి) అనిల్ పుట్టిన రోజు. 57వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ నటుడు.. ఇప్పటికీ 24 ఏళ్ల కుర్రాడినేనని అనుకుంటున్నానని చెప్పారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. తన ఇద్దరు కూతుర్లు పరిశ్రమలో దూసుకుపోతున్నారని చెప్పారు. సోనమ్ కపూర్ ఇప్పటికే తనేంటో నిరూపించుకుందని,రియా రెండో సినిమా 'ఖుబ్ సూరత్' నిర్మాణాన్ని మొదలు పెట్టిందని తెలిపారు. ఇందులో సోనమ్ నటిస్తోందన్నారు. బికనీర్ లో జరిగే ఈ సినిమా షూటింగ్ కు ఈ రోజు వెళుతున్నానని, అక్కడ వారితో కలిసి పుట్టిన రోజు జరుపుకుంటానని చెప్పారు.