: కోహ్లీ ర్యాంకు అత్యుత్తమం
భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఈసారి తన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల్లో 119, 96 పరుగులు చేశాడు. ఇక టీమిండియా నుంచే మరో క్రికెటర్ పుజారా ఏడవ స్థానంలో ఉన్నాడు. ఎప్పటిలాగే డివిలియర్స్ ప్రధమస్థానంలో నిలిచాడు.