: విరుద్ధ ప్రకటనలు చేసిన మంత్రులు టీజీ, కొండ్రు!
విశాఖలో రైతు శిక్షణా కేంద్రానికి మంత్రులు టీజీ వెంకటేష్, కొండ్రు మురళీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసేలా ఉందని టీజీ అన్నారు. బిల్లులో ఆర్ధిక ప్యాకేజీల గురించి కనీస ప్రస్తావన లేదన్నారు. తాము సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నందున టీ బిల్లుపై గట్టిగా వాదించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మంత్రి కొండ్రు మాట్లాడుతూ.. బిల్లులో సీమాంధ్ర అభివృద్ధిపై అన్ని అంశాలు ప్రస్తావించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే, బిల్లులో ఏమీ లేదని, కాంగ్రెస్ ఖాళీ అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియాపై ఆయన ఆగ్రహించారు.