: రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి
కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి రెండు కొత్త రైళ్లను విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభించారు. విశాఖ-జోధ్ పూర్, విశాఖ-గాంధీగామ్ రైళ్లను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పరిణామాల దృష్ట్యా విశాఖ రైల్వేజోన్ ను సాధించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన బిల్లులో రైల్వేజోన్ పై స్పష్టమైన హామీ ఇవ్వనందున, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా రైల్వేజోన్ సాధించుకోవటానికి పోరాడతామని తెలిపారు.