: ఆహారంలో మార్పులే బరువు తగ్గడానికి మార్గాలు


మనం రోజూ తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులను చేసుకుంటే చాలు, బరువు తగ్గి మన ఆరోగ్యానికి చక్కటి మార్గాన్ని వేసుకున్న వాళ్లమవుతాం. ఇప్పుడు మనం మంచి ఆహారమే తింటున్నాం కదా... అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు తినే ఆహారంలో కూడా చిన్నపాటి మార్పులను చేసుకుంటే మనం మరింత ఆరోగ్యవంతంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం తినే తిండి, చేసే శారీరక శ్రమ ఈ రెండింటిలో సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా చిన్నపాటి మార్పులు చేసుకుంటే చక్కగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్ బర్గ్‌ కి చెందిన పరిశోధకులు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా దక్షిణాసియా వాసులు చక్కగా బరువు తగ్గుతారని, తద్వారా టైప్‌-2 మధుమేహం ముప్పును తగ్గించుకోగలరని చెబుతున్నారు. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ రాజ్‌భోపాల్‌ కూడా పాలుపంచుకున్న ఈ పరిశోధనలో భారత, పాకిస్తానీ ప్రజలకు సంబంధించిన ఆహారపు అలవాట్లను పరిశీలించారు.

సాధారణంగా ఇలాంటి పరిశోధనలు ఆసుపత్రి వాతావరణంలో జరుగుతాయి. కానీ వాటికి భిన్నంగా ఈ పరిశోధన మాత్రం స్కాట్లాండ్‌లో నివాసం ఉంటున్న 171 మంది భారత, పాకిస్థానీ సంతతికి చెందిన ప్రజల ఆహార, విహార అలవాట్లను వారి ఇంటివద్దనుండే పరిశోధకులు పర్యవేక్షించారు.

వీరంతా కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారేనని రీసెర్చ్‌కు ముందు చేసిన వైద్య పరీక్షల్లో ధృవీకరించుకున్నారు. తర్వాత వారిలో కొందరికి ఆహారంలో మార్పులతోబాటు వారి సంస్కృతికి అనుగుణంగా బరువు తగ్గించుకునే విధానాలను సూచించారు. మిగిలిన వారికి సాధారణ సలహాలను మాత్రమే ఇచ్చారు. వ్యక్తుల సాంస్కృతిక నేపథ్యం, సంప్రదాయం కూడా వారు బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని వారి పరిశోధనలో తేలింది. దీని ప్రకారం బరువు తగ్గడానికి అందరికీ ఒకే రకమైన సలహాలను సూచనలను ఇవ్వకుండా వారి సంస్కృతికి అనుగుణమైన సూచనలు ఇస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని రాజ్‌భోపాల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News