: స్మృతిపథంలో పుత్ర 'రత్నం'!


పోయిన వాళ్లతోబాటు మనమూ పోలేముకదా... వారి జ్ఞాపకాలే మనకు మిగులుతాయి... అంటూ పోయినవారి ఆప్తులను ఓదార్చడం మనం వింటూవుంటాం. కానీ పోయినవారి జ్ఞాపకాలను రత్నాకారంలో పదిలపరచుకోవడం ఎక్కడా వినలేదు. అలా పోయిన తన పుత్రుడిని రత్నాకారంలో తనవద్ద పదిలపరచుకున్న ఒక తండ్రి ప్రేమను వింటే మాత్రం నమ్మకుండా ఉండలేం. తన ఇరవయ్యేళ్ల కుమారుడి మరణాన్ని తట్టుకోలేని ఒక తండ్రి తన కుమారుడిని రత్నం రూపంలో పదిలపరచుకుని తన తండ్రి ప్రేమను చాటుకున్నాడు.

ఇటలీలోని ట్రెవిసోకు చెందిన ఒక తండ్రి తన ఇరవయ్యేళ్ల కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ ఏడాది ప్రారంభంలో కారు ప్రమాదంలో మృతిచెందిన తన కుమారుడి మృతదేహాన్ని ఖననం చేశారు. కానీ కుమారుడి మరణాన్ని తట్టుకోలేని తండ్రి తన కొడుకు జ్ఞాపకాలను భద్రం చేసుకోవడానికి ఏదైనా చేయాలని భావించాడు. ఖననం చేసిన మృతదేహాన్ని తీసి దహనం చేయించి, ఆ చితాభస్మాన్ని స్విట్జర్లాండ్‌లోని స్మారక వజ్రాలు, రత్నాలు తయారుచేసే ఒక సంస్థకు పంపించాడు.

వారు దాన్ని వడపోసి అందులోని కర్బన పదార్ధాలను అత్యధిక పీడనం, అగ్నిపర్వతంలో జనించే స్థాయి ఉష్ణోగ్రతలకు గురిచేసి దాన్ని ఒకరత్నంగా తయారుచేశారు. ఇలా చేయడానికి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. అంటే 18,000 అమెరికన్‌ డాలర్లు. ఈ ప్రక్రియ ప్రారంభించి సుమారు ఎనిమిది నెలలయ్యింది. చివరికి ఆ సంస్థవారు పుత్ర రత్నాన్ని ఆ తండ్రికి అందించారు. దాన్ని తండ్రి తీసి భద్రపరచుకున్నాడు.

  • Loading...

More Telugu News