: అభిమానులకు అమెరికన్ నటి బియాన్స్ క్రిస్మస్ కానుక


అమెరికన్ సింగర్, నటి బియాన్స్ అభిమానులకు అదిరిపోయే క్రిస్మస్ బహుమతిని ప్రకటించి వారిని ఆనందంలో ముంచెత్తింది. మాసాచుసెట్స్ ట్యూక్స్ బరీలో ఉన్న వాల్ మార్ట్ సూపర్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన బియాన్స్ అక్కడున్న వినియోగదారులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది. అంతేకాదు.. అప్పటికప్పుడు వారందరికీ మొదటి 50 డాలర్ల బిల్లును చెల్లిస్తానంటూ లౌడ్ స్పీకర్ లో స్వయంగా ప్రకటించింది. దీంతో తమ అభిమాన నటి గొంతు విని సంతోషపడిన వారికి.. అంతలోనే, ఊహించని బహుమతి ఇవ్వడంతో అభిమానులు సంభ్రమాశ్చర్యాలలో మునిగితేలారు.

  • Loading...

More Telugu News