: తిరుమలలో లడ్డూ తయారీకి అంతరాయం
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూ తయారీలో అంతరాయం ఏర్పడింది. శ్రీవారి లడ్డూ తయారీ ప్రదేశంలో బూందీ తయారీ పోటులో మంటలను ఆర్పేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి, రసాయన పదార్థం లీకైంది. అది లడ్డూ తయారీలో ఉపయోగించే బూందీ, నెయ్యి, శనగపిండి తదితర పదార్థాలపై పడింది. దీంతో కొద్దిసేపటి క్రితం లడ్డూ తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు.