: సెక్యూరిటీని నిరాకరించిన కేజ్రీవాల్


ముఖ్యమంత్రి అంటేనే... ట్రాఫిక్ నిలిపివేయడం, చాంతాడంత కాన్వాయ్, అత్యంత పటిష్ఠమైన భద్రత, లేనిపోని హడావుడి... ఇలాంటివన్నీ కనపడతాయి. ఏఏపీ అధినేత, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సంప్రదాయానికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమంటూ ప్రకటించగానే... ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాబోయే ముఖ్యమంత్రికి భారీ సెక్యూరిటీ కల్పించడానికి సన్నద్ధమయ్యారు. అయితే, కేజ్రీవాల్ పోలీసుల వినతిని తిరస్కరించారు. తనకంత భద్రతా ఏర్పాట్లు అవసరం లేదని పోలీసు సిబ్బందిని వెనక్కు పంపించారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

  • Loading...

More Telugu News