: సీఎం మీడియా ముందు మాత్రమే సమైక్యవాదం వినిపిస్తున్నారు: పయ్యావుల
రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు ఆయన ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ కేవలం మీడియా ముందు మాత్రమే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి తనకున్న అన్ని అవకాశాలను ముఖ్యమంత్రి ఉపయోగించుకోవాలని కేశవ్ సూచించారు. ముసాయిదా బిల్లు లోటుపాట్లపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.