: వందకోట్ల మార్కును దాటిన 'ధూమ్ 3'
బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 3' వసూళ్లలో దూసుకుపోతోంది. ఓపెనింగ్ వీకెండ్ లో వందకోట్ల మార్కును దాటింది. తొలిరోజే ఈ చిత్రం 33 కోట్లు వసూలు చేసింది. తర్వాత రెండు రోజుల్లో హిందీ వెర్షన్ లో రూ.100.76 కోట్లు దాటగా.. తెలుగు, తమిళ భాషల్లో రూ.6.85 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు.