: ఫైనాన్స్ సంస్థలో సిబ్బంది ‘చేతివాటం’.. రూ. కోటి 76 లక్షలు మాయం
హైదరాబాదు మహానగర పరిధిలోని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే సిబ్బంది చేతివాటం బట్టబయలైంది. ఒకటి, రెండూ కాదు.. ఏకంగా కోటి రూపాయలకు పైగానే సొమ్మును నిందితులు మాయం చేశారు. బంగారు ఆభరణాలకు ఇచ్చే రుణాల్లో మోసానికి పాల్పడినట్లు కంపెనీ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటి 76 లక్షలు కాజేసిన ముగ్గురు సిబ్బందిని ఇవాళ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.