: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టీస్ గంగూలీ లేఖ
న్యాయశాస్త్ర విద్యార్థినిపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే గంగూలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గంగూలీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంకు లేఖ రాశారు. ఈ కేసులో తనవైపు వాదనలను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తనపై సుప్రీంకు ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలపై తాను నిరసన వ్యక్తం చేసానని తెలిపారు. ప్రస్తుతం గంగూలీ పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా పని చేస్తున్నారు.