: ఐపీఎల్ ఆరంభ వేడుకలలో కత్రినా, ప్రియాంకాల నృత్యాలు
ఈమధ్య కాలంలో సినీ తారల భాగస్వామ్యం లేనిదే ఏ వేడుకా జరగడం లేదు. సమాజంలో తారలకున్న క్రేజ్ అటువంటిది. అందుకే, వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఆరో సీజన్ క్రికెట్ పోటీల ఆరంభోత్సవంలో కూడా తారల సందడి ఎక్కువగానే వుంది. ఏప్రిల్ 2 న కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ఈ పోటీల ప్రారంభకార్యక్రమంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా తమ డ్యాన్సులతో అదరగొట్టనున్నారు.
ఇందుకు సంబంధించిన ఒప్పందం ఇప్పటికే పూర్తయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నేతృత్వంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ వేడుకల నిర్వహణ బాధ్యతను తీసుకుంది. ఇందుకు గాను కత్రినా, ప్రియాంకాలకు భారీ మొత్తంలో పారితోషికం అందజేస్తున్నారు.