: అమెరికాలో నూతన భారత రాయబారిగా జయశంకర్
అమెరికాలో కొత్త భారత రాయబారిగా యస్.జయశంకర్ రేపు ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు నిరుపమారావు అక్కడ మన రాయబారిగా వ్యవహరించారు. వీసా అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో దౌత్య అధికారిణి దేవయాని అరెస్టైన తరుణంలో జయశంకర్ భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దేవయాని ఉదంతంతో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు సున్నితమైన స్థితికి చేరుకున్న సందర్భంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటిదాకా ఆయన చైనాలో భారత రాయబారిగా సేవలందించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హవాయీ దీవుల్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో, ఒబామా తిరిగి వచ్చిన తర్వాత జయశంకర్ తన క్రెడెన్షియల్స్ ను ఆయనకు సమర్పిస్తారు.