: టీడీపీ నిర్ణయంతో కిరణ్ సర్కారుకి ఊపిరి!
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిన్న రాత్రి నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసం పేరుతో ఇది టీఆర్ఎస్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడ అని టీడీపీ భావిస్తోంది. రాజకీయ ప్రయోజనాలతో చేబడుతున్న ఈ తీర్మానానికి మద్దతిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని టీడీపీ ఆలోచిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ తీర్మానానికి దూరంగా వుండాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
మరోపక్క వైయస్సార్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. శాసనసభలో టీఆర్ఎస్ తీర్మానానికి నోటీసు ఇచ్చాకనే నిర్ణయం తీసుకోవాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ఈ కుమ్ములాటలు, లుకలుకలు అధికార కాంగ్రెస్ పార్టీకి కోరని వరంగా ప్రాప్తించాయి. దాంతో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాసం విషయంలో గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది.