: 'తెహల్కా' ఎడిటర్ రిమాండ్ పొడిగింపు
'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు గోవాలోని పనాజీ సెషన్స్ కోర్టు మరో పన్నెండు రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు జనవరి 4 వరకు ఆయనకు రిమాండ్ ఉంటుంది. సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో గతనెల 30న తేజ్ పాల్ ను గోవా పోలీసులు అరెస్టు చేశారు.