: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాబీ జిందాల్ పోటీ చేయొచ్చు: యూఎస్ సెనేటర్


2016లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత, ప్రస్తుత లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ పోటీచేసే అవకాశం ఉందని యూఎస్ సెనేటర్ డేవిడ్ విట్టర్ తెలిపారు. ఈ మేరకు జిందాల్ ప్రణాళిక తయారు చేసుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో నిన్న(ఆదివారం)ఓ ప్రైవేటు టీవి చానల్ ఇంటర్వ్యూలో చానల్ డేవిడ్ మాట్లాడుతూ.. 'రానున్న ఎన్నికల్లో జిందాల్ పోటీ చేయవచ్చని నేను అనుకుంటున్నాను. అధ్యక్ష పదవికి జిందాల్ అర్హుడని... ఆయన నాయకత్వాన్ని నేను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. లూసియానాకు రెండోసారి గవర్నర్ గా వ్యవహరిస్తున్న జిందాల్ పదవీకాలం 2015లో ముగియనుంది. నిబంధనల ప్రకారం మూడోసారి పోటీచేసేందుకు అవకాశం లేదు.

  • Loading...

More Telugu News