: కాంగ్రెస్ నేతలు దోచుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు: బాబు
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతలు ప్రజలను దోచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వీరవాసరం వద్ద బాబుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలకు తిలోదకాలు ఇచ్చిన సర్కారు ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. వేల కోట్ల రూపాయల సర్ ఛార్జీ వడ్డించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయానికి 7గంటలు విద్యుత్ ఇవ్వడంలో విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.