: 31వ తేదీ రాత్రి నిరంతరాయంగా షిర్డీ సాయి దర్శనం


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీలోని సాయిబాబా మందిరాన్ని దర్శించుకొనేందుకు 31వ తేదీన రాత్రంతా భక్తులను అనుమతించనున్నారు. సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని బాబా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నామని శ్రీ సాయిబాబా సంస్థాన్ కార్య నిర్వాహక అధికారి అజయ్ మోరే తెలిపారు. ఈ వేడుకల సమయంలో సాయి పల్లకీతో కాలినడకన వచ్చే భక్తులు కూడా సామాన్య దర్శనం నుంచే బాబాను దర్శించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మందిరం వద్ద వివిధ భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News