: చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు జరిమానా
చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు ముంబయిలోని అంధేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించింది. ఈ ఏడాదిలో ప్రీతి నటించిన 'ఇష్క్ ఇన్ ప్యారిస్' చిత్రానికి... ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. చిత్రానికి స్క్రిప్టు రాసిన అబ్బాస్ టైర్ వాలాకు ప్రీతి రూ.18 లక్షల చెక్ ఇచ్చింది. ఆ చెక్ బౌన్స్ అవడంతో రచయిత కోర్టును ఆశ్రయించాడు. వెంటనే అతడి ఫిర్యాదును రద్దు చేయాలంటూ ప్రీతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ, విచారణ సమయంలో రెండుసార్లు కోర్టుకు గైర్హాజరైంది. తాజాగా విచారణను వాయిదా వేయాలని మళ్లీ న్యాయస్థానాన్ని ఆమె కోరడంతో ఆగ్రహించిన కోర్టు జరిమానా విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.