: పదేళ్లు పాలించాం.. వ్యతిరేకత సహజం: రఘువీరా


కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్ల నుంచి పరిపాలన కొనసాగిస్తోందని... ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత సహజంగానే ఉంటుందని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 9వ వర్ధంతి సందర్భంగా అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాటు మైనార్టీ ప్రభుత్వాన్ని పీవీ సమర్థవంతంగా నడిపినప్పటికీ... 1998లో ఆయనకు కనీసం ఎంపీ టికెట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు అమోఘమని రఘువీరా తెలిపారు.

  • Loading...

More Telugu News