: ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీ సిద్ధం... కాసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ
కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమంటూ కేజ్రీవాల్ నిన్ననే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మరి కాసేపట్లో కేజ్రీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలవనున్నారు.