: కేన్సర్‌ చికిత్సకు తోడ్పడే యోగా


ప్రాచీన కాలం నుండి మనదేశంలో యోగులు యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటూ వచ్చారు. మనదేశంలో యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీనిపై ఇప్పుడు పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు యోగా ద్వారా బోలెడన్ని ప్రయోజనాలున్నాయని గుర్తించారు. కేన్సర్‌ వ్యాధికి చేసే చికిత్సకు యోగా మరింతగా ఉపకరిస్తుందని అమెరికాలోని టెన్నిషీ రాష్ట్రంలో మెంఫిస్‌లోని సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు చెబుతున్నారు.

వీరు కేన్సర్‌ వ్యాధికి గురైన కొందరు పిల్లలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. కేన్సర్‌ చికిత్స తీసుకుంటున్న పిల్లలతో యోగాభ్యాసం చేయించడంతోబాటు పౌష్టికాహారం అందేలా ఆహారంలో మార్పు చేయడంతో చికిత్సా పరంగా మంచి ఫలితాలు వచ్చాయని హాస్పిటల్‌ ప్రతినిధి జెస్సికా స్పారో చెబుతున్నారు. యోగాభ్యసనం ద్వారా నొప్పిని తగ్గించుకోవడం, ఓర్పును అలవర్చుకోవడం, ఇతర ప్రయోజనాలు పొందేలా తాము కృషి చేస్తున్నామని జెస్సికా తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నిపుణుడి ద్వారా కేన్సర్‌ బాధిత పిల్లలకు యోగా శిక్షణను ఇప్పిస్తున్నట్టు జెస్సికా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News