: అవిశ్వాసంపై ఎల్లుండి స్పీకర్ కు నోటీసు ఇవ్వనున్న టీఆర్ఎస్
శాసనసభ బడ్జ్టెట్ సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్న తరుణంలో టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అవిశ్వాసం విషయంలో రేపు సహచర విపక్షాల మద్దతు కూడగట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో వామపక్షాలు, ఎంఐఎం, బీజేపీ నేతలను టీఆర్ఎస్ నాయకులు కలవనున్నారు. కాగా, టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసును ఎల్లుండి స్పీకర్ కు ఇవ్వాలని నిర్ణయించింది.