: భీమవరంలో ‘భీమవరం బుల్లోడు’ ఆడియో రిలీజ్


సునీల్ కథానాయకుడిగా నటించిన భీమవరం బుల్లోడు ఆడియో రిలీజ్ వేడుక భీమవరంలో జరిగింది. డాక్టర్ రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా రవి, లాస్య వ్యవహరించారు. మాటీవీ మ్యూజిక్ ఛానల్ లో ఉదయం ప్రసారమయ్యే 'సమ్ థింగ్ స్పెషల్'లో వీరు వీక్షకులకు చిరపరిచితులే. ఈ ఆడియో వేడుకలో టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ కు డ్యాన్సర్లు హుషారుగా నృత్యం చేశారు. హీరో సునీల్, హీరోయిన్ ఎస్తేర్, నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు ఉదయశంకర్, పాటల రచయిత చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News