: ప్రజలకు మంచినీటిని అందించేందుకు.. మజ్లిస్ కొత్త పథకం
హైదరాబాదు నగరంలో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా.. మజ్లిస్ పార్టీ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. రూపాయికే పది లీటర్ల మంచినీరు (మినరల్ వాటర్) అందించే పథకాన్ని ఇవాళ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. మెహదీపట్నంలోని సయ్యద్ నగర్ లో మంచి నీటి శుద్ధి యంత్రాన్ని ఒవైసీ ప్రజల అవసరార్థం అందుబాటులోకి తీసుకువచ్చారు. తన ఎంపీ నిధులతో పాటు పార్టీ సొమ్ముతో దీన్ని సమకూర్చినట్టు ఆయన చెప్పారు. గంటకు నాలుగు వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి అందించే సామర్థ్యం ఈ యంత్రానికి ఉందని ఆయన తెలిపారు.