: తెలంగాణను ఎవరూ ఆపలేరు: కేసీఆర్


విభజన బిల్లు వచ్చిన తర్వాత కూడా సీమాంధ్ర నేతలు ఎంతో రాద్దాంతం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ వారికి సీమాంధ్రులకు చెందినదేమీ అవసరం లేదని చెప్పారు. కానీ, సీమాంధ్రులు మాత్రం 'మాదీ కావాలి, మీదీ కావాలి' అంటారని ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణవాదులు తిరగబడ్డారని తెలిపారు. తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదని కేసీఆర్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, ఇక్కడ కరెంటు సమస్య మాత్రం తీవ్రంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News