: కాంగ్రెస్, ఆర్జేడీలు బీహార్ ను నాశనం చేశాయి: నితీష్ కుమార్
రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ మళ్లీ జతకట్టే అవకాశాలు కనపడుతుండటంతో... బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆ రెండు పార్టీలపై మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు బీహార్ ను మళ్లీ చీకటి రోజులవైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల బీహార్ 15 ఏళ్ల పాటు దారుణ పరిస్థితులను ఎదుర్కొందని మండిపడ్డారు. 2005లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం తాను రాత్రింబవళ్లు కష్టపడ్డానని చెప్పారు.