: వైఎస్సార్సీపీలో చేరిన సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర
సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతుండటంతో... ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.రాజన్న దొర వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు వైకాపా కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.