: విభజిస్తే నాతో పాటు సీఎం కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారు: లగడపాటి
విభజన జరిగితే తానే కాదు, సీఎం కిరణ్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారని తాను భావిస్తున్నట్టు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ చెప్పారు. విభజనను ఆపాల్సిన బాధ్యత సీమాంధ్ర నేతలదే అని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్జీవోలు పోషించిన పాత్ర అమోఘమని అన్నారు. ఈ రోజు ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని లగడపాటి తెలిపారు. అసెంబ్లీలో టీబిల్లును వ్యతిరేకిస్తే, సమైక్యానికి 95 శాతం అనుకూలత పెరుగుతుందని అన్నారు.