: ప్రభుత్వం అమలు చేసిన ‘ఆధార్’ నిరాధార్ అయింది: వెంకయ్య నాయుడు


దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ అధ్వానంగా తయారవుతోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ వశమయ్యాయని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆధార్’ కార్డుల ప్రకియ కాంగ్రెస్ కు నిరాధార్ గా మారిందని అన్నారు. ఇక ఆహార భద్రతా పథకం అధికార పార్టీకి రాజకీయ భద్రత లేకుండా చేస్తోందని ఆయన చమత్కరించారు. కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహులు, విశ్వాస ఘాతకులున్న పార్టీగా ప్రజలు భావిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News