: విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్
సఫారీ గడ్డపై చరిత్రాత్మక విజయానికి భారత్ 8 వికెట్ల దూరంలో నిలిచింది. జొహానెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ముందు భారత్ 458 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించే క్రమంలో నిన్న సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కీలకమైన స్మిత్ (44), ఆమ్లా (4) వికెట్లను భారత్ పడగొట్టింది. పీటర్సన్ (76), డు ప్లెసిస్ (10) క్రీజులో ఉన్నారు. ఈ రోజు ఆటకు చివరి రోజు. దక్షిణాఫ్రికా చేతిలో 8 వికెట్లున్నాయి. సాధించాల్సిన పరుగులు 320 ఉన్నాయి. మన బౌలర్లు సత్తా చాటితే దక్షిణాఫ్రికాలో చరిత్రాత్మక విజయం సాధించినట్టే. ఇప్పటి దాకా టెస్టుల్లో అత్యధికంగా 418 పరుగుల లక్ష్య ఛేదనే జరిగింది. మరి, భారత్ నిర్దేశించిన 458 పరుగులను దక్షిణాఫ్రికా ఛేదిస్తుందా? వేచిచూడాల్సిందే.