: క్రిస్మస్ పండుగ నాడు క్రైస్తవులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జేడీ శీలం
క్రిస్మస్ పండుగ జరుపుకొనే ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం అన్నారు. క్రీస్తు సందేశాన్ని ఆచరిస్తూ దేశంలోని క్రైస్తవులు, దళిత క్రైస్తవులు కలసిమెలసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు నగరపాలెంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్, జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ సహా పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రిస్మస్ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.