: కాంగ్రెస్ లో ఉంటూ అవిశ్వాసం పెట్టడం మంచిది కాదనే దూరంగా ఉన్నా: కావూరి


యూపీఏపై సీమాంధ్ర ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాదని తాను ముందుగానే ఊహించానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అవిశ్వాస తీర్మానం పెట్టడం మంచిది కాదనే... అవిశ్వాసానికి దూరంగా ఉన్నానని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏపీఎన్జీవోలకు వ్యతిరేకం కాదని... వారినెప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తనపై దాడికి యత్నించిన ఎమ్మెల్యేనే తాను తిట్టానని చెప్పారు.

  • Loading...

More Telugu News