: స్మగ్లర్లను బంధించిన గ్రామస్తులు... మరికొంత మంది కోసం వేట
కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిని... ఎర్రచందనం స్మగ్లర్లు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శేషాచలం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చింది. ఈ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కలికిరికొండ అటవీ ప్రాంతంలోని బత్తలపల్లి, కొత్తూరు గ్రామస్తులు 20 మంది స్మగ్లర్లను గుర్తించి... వెంటాడి, వేటాడారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ముగ్గురు స్మగ్లర్లను పట్టుకుని, బంధించారు. గ్రామస్తుల దాడితో ఉక్కిరిబిక్కిరైన మరో 17 మంది స్మగ్లర్లు కొండల్లోకి పరుగులు తీశారు. అయితే పారిపోయిన ఎర్రచందనం దొంగలను పట్టుకోవడానికి, గ్రామస్తులు అడవిని జల్లెడ పడుతున్నారు.