: కడపలో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప జిల్లా రాజంపేట సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీ శాఖాధికారులు అడ్డుకున్నారు. రెండు లారీల్లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. చందనం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు, మరొక డ్రైవర్ పరారీలో ఉన్నాడు.