: ప్రారంభమైన ఏపీఎన్జీవోల నామినేషన్ల స్వీకరణ
ఏపీఎన్జీవోల ఎన్నికలకు సంబంధించి మొదటి అంకం ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సమైక్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తన నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవి కోసం అశోక్ బాబుపై పై ప్రకాశం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బషీర్ తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ప్యానెల్ లో 17 మంది పోటీ చేస్తున్నారు. జనవరి 5వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.