: కిరణ్ ను సాగనంపుదాం.. మద్దతివ్వండి: టీడీపీ, వైఎస్సార్సీపీలకు టీఆర్ఎస్ బహిరంగ లేఖ
రేపటినుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో, అవిశ్వాస తీర్మానంపై మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీలకు బహిరంగ లేఖలు రాసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు తోడు తెలంగాణపై కాంగ్రెస్ కప్పదాటు వైఖరికి వ్యతిరేకంగానే అవిశ్వాసం పెడుతున్నామని, తప్పక మద్దతివ్వాలని ఆ లేఖలో టీఆర్ఎస్ కోరింది.