: విశాఖ స్టేడియంలో బాలీవుడ్ జట్టు భారీ షాట్లు.. టాలీవుడ్ జట్టు టార్గెట్ 211
విశాఖలోని వైఎస్సార్-వీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలతో కళకళలాడుతోంది. ఇవాళ టాలీవుడ్, బాలీవుడ్ జట్ల మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోన్న విషయం విదితమే. టాస్ గెలిచిన బాలీవుడ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 210 పరుగుల స్కోర్ సాధించింది. బాలీవుడ్ ఆటగాళ్లు బౌండరీలతో చెలరేగిపోయారు. ప్రొఫెషనల్ ఆటగాళ్ల మాదిరిగా సినీ తారలు భారీ షాట్ లు కొడుతుంటే అభిమానులు చప్పట్లతో కేరింతలు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. టాలీవుడ్ జట్టు విజయ లక్ష్యం 211 పరుగులు.