: విశాఖలో సందడిగా సినీ తారల క్రికెట్ మ్యాచ్
విశాఖపట్నంలోని వైఎస్సార్-వీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సినీ తారల రాకతో కళకళలాడుతోంది. ఇవాళ టాలీవుడ్, బాలీవుడ్ జట్ల మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తమ అభిమాన నటులను చూసేందుకు సినీ, క్రీడాభిమానులు భారీగా తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. బాలీవుడ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల స్కోర్ సాధించారు. బాలీవుడ్ ఆటగాళ్లు బౌండరీలతో చెలరేగిపోయారు. రాజా అర్థసెంచరీతో (54) రాణించారు. క్రీజులో షబ్బీర్, ఆఫ్తాబ్ ఉన్నారు.