: ‘సహారా ఇండియా’లో సిబ్బంది ‘చేతివాటం’..రూ.26 లక్షలు మాయం


తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని సహారా ఇండియా సంస్థ సిబ్బంది ‘చేతివాటం‘ వెలుగులోకి వచ్చింది. ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 26 లక్షల రూపాయల సొమ్మును మాయం చేశారు. తమ సంస్థ నిధులు గల్లంతైన విషయాన్ని గ్రహించిన సహారా ఇండియా అధికారులు సిబ్బందిపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాకినాడ శాఖలో పనిచేసే శ్రీనివాసరావు, దివాకర్ లే సంస్థ సొమ్మును స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News