: పదిహను వందల ఉద్యోగాలకు పదిహేడు లక్షల దరఖాస్తులు..!


భారతీయ స్టేట్ బ్యాంకు ప్రకటించిన 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగాలకు 17 లక్షల దరఖాస్తులు వచ్చాయట. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఉక్కిరిబిక్కిరైన ఎస్ బీఐ అధికారులు ఆ దరఖాస్తులన్నంటినీ పరిశీలిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎస్ బీఐ చైర్మన్ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ, నియామకాల ప్రకటన ఈసారి మరింత ఆకర్షణీయంగా ఉండేట్లు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎంపికైతే అందుకునే జీతభత్యాలు, ఇతర ప్యాకేజిల వివరాలను చక్కగా పొందుపరిచామని, ఈ కారణంగానే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు పంపారని చైర్మన్ వెల్లడించారు. 

  • Loading...

More Telugu News