: 'భాగ్ మిల్కా భాగ్' పూర్తిగా నకిలీ చిత్రం: నసీరుద్దీన్ షా


ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం 'భాగ్ మిల్కా భాగ్' అందరికీ తెలిసిందే. దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించాడు. ఈ సినిమా మంచి పేరుతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, ఈ చిత్రంపై తాజాగా బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాను పూర్తిగా నకిలీ చిత్రంగా తాను భావిస్తున్నానని అన్నారు. చిత్రం కోసం ఫర్హాన్ బాగా కష్టపడ్డాడని అన్నారు. అయితే, పాత్ర కోసం ఫర్హాన్ కండలు, జుట్టు పెంచుకున్నా నటనపై అంత దృష్టి పెట్టలేదన్నారు. కనీసం మిల్కాలా కనిపించేందుకు ప్రయత్నించాల్సిందని సూచించారు.

  • Loading...

More Telugu News