: పార్టీకి, ప్రభుత్వానికీ సమన్వయమేదీ?: జానా రెడ్డి
పాలనకు సంబంధించిన ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తమను సంప్రదించడంలేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈ సాయంత్రం సమావేశమయ్యారు.
భేటీ అనంతరం మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ, పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక రాష్ట్ర సమస్యను పరిష్కరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ విషయంలో సోనియా, రాహుల్ లను కలుస్తామని జానా రెడ్డి చెప్పారు.