: పెయిడ్ న్యూస్ ను నేరంగా పరిగణించండి: ఎన్నికల సంఘం
ఎన్నికల సందర్భంగా అన్నిరకాల చెల్లింపు వార్తలను నేరంగా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం న్యాయశాఖకు సిఫారసు చేసింది. తిరువనంతపురం లోని సెమినార్ లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ మాట్లాడుతూ ప్రజలు, అభ్యర్థులు, మీడియా అందరిపైనా చెల్లింపు వార్తల ప్రభావం ఉంటుందని ఆ సిఫారసుల్లో స్పష్టం చేశారన్నారు. ఇవి ఎన్నికల ప్రక్రియకు అధిక నష్టం కల్గిస్తాయని ఆయన వివరించారు.